![]() |
![]() |
.webp)
గుప్పెడంత మనసుతో తెలుగు ఆడియన్స్ మనసుల్ని దోచుకున్న వసుధారా అలియాస్ రక్షా గౌడ గురించి చెప్పక్కర్లేదు. సీరియల్ ఐపోయినా కూడా రిషి సర్ ని వసుధారని ఎవరు మర్చిపోలేదు. రిషిధార అనే పేరును కూడా ఎవరూ వదల్లేదు. ఇక రీసెంట్ గా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమోలో తళుక్కుక్కుమంది ఈ అమ్మడు.
ఏఎస్ఎంపి పాన్ ఇండియా లీగ్ పేరుతో ఈ షో రాబోతోంది. "తొడగొట్టి వస్తున్న తెలుగోళ్లు ఒక వైపు అంటూ శ్రీముఖి చెప్పింది. ఈ టీమ్ లో శ్రీకర్, మానస్, రోహిణి ఉన్నారు. వీళ్ళు తెలుగు టైగర్స్ పేరుతో వచ్చారు. తగ్గేదెలా అంటూ వస్తున్నా తమిలోళ్ళు ఒక వైపు అని చెప్పింది. ఈ టీమ్ లో బాలు, సంధ్య, రీతూ చౌదరి ఉన్నారు. వీళ్ళ టీమ్ పేరు తమిళ్ తలైవాస్ . మాస్ ని చూపిస్తామంటున్న మలయాళీలు మరో వైపు అంది శ్రీముఖి. ఈ టీమ్ లో ప్రిన్సి, యాదమ్మ రాజు, అర్జున్ కళ్యాణ్ ఉన్నారు.
వీళ్ళ టీమ్ పేరు మలయాళం మిస్సైల్స్ గా పెట్టుకున్నారు. ఎంటర్టైన్మెంట్ కి కింగ్స్ మేమె అంటున్న కన్నడ వాళ్ళు ఇంకో వైపు అని చెప్పింది. ఈ టీమ్ లో రక్షా గౌడ, అమరదీప్, శ్రీ సత్య. వీళ్ళ టీమ్ పేరు కన్నడ బాద్షాష్ గా పెట్టుకున్నారు. ఇక ఇందులో ఒక మ్యాజిక్ షో కూడా ఉండబోతోంది. తర్వాత రక్షా గౌడ అద్దిరిపోయే డైలాగ్ చెప్పింది. "వయోలెన్స్, వయోలెన్స్, వయోలెన్స్, ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవాయిడ్. వయోలెన్స్ లైక్స్ మీ " అంటూ చెప్పుకొచ్చింది.ఇక నెటిజన్స్ ఐతే ముకేశ్ గౌడని కూడా తీసుకురండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |